మూడుసార్లు అసెంబ్లీలోనే
ఆమోదించాం జస్టిస్ ఘోష్
కమిషన్‌కు ఆధారాలు సమర్పించా
కృష్ణా జలాలపై సిఎం రేవంత్‌రెడ్డి
చెప్పేవన్నీ అబద్ధాలే కమిషన్‌కు
ప్రభుత్వం సమర్పించిన
సమాచారాన్ని ఇవ్వాలని కోరితే
స్పందనే లేదు ఘోష్ కమిషన్‌ను
కలిసిన అనంతరం మాజీ మంత్రి
హరీశ్‌రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం క మిషన్ ఎదుట శుక్రవారం ఉదయం మాజీ మం త్రి తన్నీరు హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆయన వద్ద అందుబాటులో ఉన్న స మాచారాన్ని క్రోడీకరించి ఒక నోట్ రూపంలో జస్టిస్ పిసిఘోష్‌కు అందజేశారు. విచారణ సం దర్భంగా ఇతరులెవ్వరినీ కమిషన్ అనుమతించలేదు.విచారణ అనంతరం మాజీ మంత్రి, ఎ మ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను దృష్టిలో పెట్టుకొని తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందజేసినట్లు చెప్పారు. పూర్తి సమాచా రం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపానల శాఖ కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శులకు లేఖ రాసినప్పటికీ వారి నుంచి స్పందన లేదని తెలిపారు. తనకు తె లిసినంత వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయన్నారు. ఆరు సార్లు క్యాబినెట్ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు కమీషన్ కు అందించినట్లు తెలిపారు.
అంతే కాకుండా మూడు సార్లు శాసన సభ ఆమోదం కూడా పొందిందన్నారు. లెజిస్టేచర్ అప్రూవల్ క్యాబినెట్ కంటే కూడా ఉత్తమం అని, ఆరు సార్లు క్యాబినెట్ అప్రూవల్ వివరాలు, మూడు సార్లు జరిగినఅసెంబ్లీ ఆమోదం, వాటి చర్చ వివరాలను కమిషన్ కు డాక్యుమెంట్లతో సహా అందజేసినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కు అందించిన సమాచారాన్ని తమకూ ఇవ్వాలని కోరితే ఇవ్వడం లేదని, పారదర్శకంగా ఉండాలనుకున్నప్పుడు తమకు ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదో అర్ధం కావడంలేదని ఆయన అన్నారు. కమిషన్ ను తప్పుదోవ పట్టించేలా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం తమకు ఉందనే అభిప్రాయాన్ని హరీష్‌రావు వ్యక్తం చేశారు.
అది అబద్దాల పిపిపి
కృష్ణానదీ జలాల వివాదంపై ప్రజాభవన్‌లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పిపిపి) ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా ఉందని హరీష్‌రావు ఆరోపించారు. నాడు మాజీ సిఎం కెసిఆర్ తెలంగాణ, ఏపి రాష్ట్రాలకు కృష్ణానదీ జలాల వాటాలు 299 టిఎంసి, 512 టిఎంసిగా శాశ్వత ఒప్పందం చేసుకున్నారని ప్రభుత్వం పదే పదే అబద్దం చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆ విధంగా ఒప్పందం కెసిఆర్ చేసి ఉంటే, సెక్షన్ 3 కోసం కెసిఆర్ ఎందుకు అడుగుతారని ఆయన ప్రశ్నించారు.
కోల్‌కత్త వెళ్లిన ఘోష్
కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ శుక్రవారం సాయంత్రం తన స్వస్థలం కోల్‌కత్తాకు బయలుదేరి వెళ్లారు. కమిషన్ తుది నివేదికకు తుదిరూపు ఇవ్వనున్నారు. ఈనెలాఖరుకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ నివేదికను అందజేయనున్నారు.