- Advertisement -
హైదరాబాద్: వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా..ప్రభుత్వ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish rao) విమర్శించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హరీష్ రావు దిగ్ర్భాంతి చెందారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..వేసవిలో ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు బలవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అగ్నిమాపకశాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున, ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
- Advertisement -