Monday, May 12, 2025

విద్యార్థులపై రేవంత్‌కు చులకన భావం

- Advertisement -
- Advertisement -

స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమ్రంతి తన నివాసం
నుంచి పోటీపరీక్షల ఫలితాలు
విడుదల చేయలేదు సిఎం
సెక్రటేరియట్ మొఖమే
చూడడం లేదు ఇదేనా
ప్రజాపాలన: హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎప్‌సెట్ ఫలితాలను సిఎం రేవంత్‌రెడ్డి తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి విడుదల చేయడం అహంభావమని మాజీ మంత్రిహరీష్‌రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇది పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి, మంత్రు లు కూడా పోటీ పరీక్షల ఫలితాలను ఇంటి నుండి విడుదల చేయలేదని అన్నారు. అయితే కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి లేక జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి పాలన కొనసాగించే ఈ సిఎం, అటు పోలీసులను పని చేసుకోనివ్వడం లేదు, ఇటు అధికారులను పని చేయనివ్వడం లేదని ఆరోపించారు. సిఎం సెక్రటేరియట్ మొఖం చూడడం లేదని విమర్శించారు. ప్రజా పాలన అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు. ఎప్‌సెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News