- Advertisement -
కాంగ్రెస్, బిజెపి పార్టీలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నీతి ఆయోగ్ మీటింగ్‌ని బాయ్‌కాట్ చేస్తున్నామని చెప్పి.. ఇప్పుడు అందరికంటే ముందే పోయి అక్కడ కూర్చున్నాడని హరీష్ రావు మండిపడ్డారు.ఇక, తెలంగాణ పట్ల బిజెపికి ఎందుకింత కక్ష అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది బిజెపి ఎంపిలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే.. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురావడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 1లక్ష 60 వేల కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు, తెలంగాణకు అందులో 1 శాతం కూడా ఎందుకు ఇవ్వడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు.
- Advertisement -