హైదరాబాద్: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరంపై దుష్ప్రరం చేయడమే రేవంత్, ఉత్తమ్ అజెండా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఒకరు రాష్ట్ర ఆదాయానికి, మరొకరు నీటివాటాకు గండి కొడుతున్నారని.. ఏడాదిన్నరలో వీళ్లు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది లేదు అన్నారు. జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఆనాడు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పి 18 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు తట్టెడుమట్టి ఎందుకు తీయలేదో చెప్పాలని హరీశ్ (Harish Rao) ధ్వజమెత్తారు. దేశంలో అంచనాలు పెరగకుండా పూర్తయిన ప్రాజెక్టు ఏదైనా ఉందా అని అడిగారు. వందరోజులైనా ఎస్‌ఎల్‌బిసిలో మృతదేహాలను తీయలేని అమర్థత ప్రభుత్వానిదని మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బిసి భవితవ్యాన్నే కాంగ్రెస్ పాలన ప్రశ్నార్థకం చేసిందని పేర్కొన్నారు.