Sunday, August 31, 2025

ఆ నిధులను పట్టణాలకు ఎప్పుడు ఇస్తారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ ప్రగతిని బంద్ చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఎప్పుడు పట్టణాలకు ఇస్తారని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసన సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగించారు.  గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధం పడకేసిందని, మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, జిన్నారం, ఇంద్రేశం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిలదీశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి పెంచుకోవడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎంఎల్‌ఎలు ఉన్న సెగ్మెంట్లకు నిధులు ఎందుకు రద్దు చేశారని, నిధులు ఇవ్వకపోతే మున్సిపాలిటీలు ఎలా నడుస్తాయని హరీష్ రావు అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News