Tuesday, June 17, 2025

అవినీతి ఎక్కడుందో చెప్పాలి

- Advertisement -
- Advertisement -

ఎసిబి అధికారులనే నిలదీశా
ఒకే ప్రశ్నను తిప్పితిప్పి అడిగారు
ఇదో లొట్టపీసు కేసు..రేవంత్‌రెడ్డి
ఓ లొట్టపీసు సిఎం మమ్మల్ని
జైల్లో పెట్టి పైశాచిక ఆనందం
పొందాలని సిఎం ప్రయత్నం
తెలంగాణ ప్రతిష్ఠ పెంచాను
తప్ప తప్పు చేయలేదు ఈకార్
కేసులో విచారణ అనంతరం కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్ర తిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే ప ని చేశానే కానీ తాను ఎలాంటి తప్పు చేయలేద ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అ న్నారు. నాలుగు గోడల మధ్య కాదు..నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా ఈ రేసు గు రించి అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్ రెడ్డి పారిపోయారని విమర్శించారు. రూ.50 లక్ష ల డబ్బుల బ్యాగుతో అడ్డంగా దొరికి నెల రో జులు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి, తమను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలన్న శాడిస్ట్ ఆలోచనతో ఉన్నాడని కెటిఆర్ ఆరోపించారు.అందులో భాగంగానే తెలంగాణ సాధించిన కెసిఆర్‌ను, మాజీ మంత్రి హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ముందుకు, తనను ఎసిబి విచారణకు పిలుస్తున్నాడని చెప్పారు. ఇవన్నీ లొట్టపీసు కేసులు అని, రేవంత్ రెడ్డి ఓ లొట్ట పీసు ముఖ్యమంత్రి అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో సోమవారం కెటిఆర్ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) విచారణ కాగా, ఆయనను సుమారు 8 గంటలపాటు ఎసిబి ప్రశ్నించింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఎసిబి అధికారులు కెటిఆర్‌కు తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత కెటిఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ బిఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర నాయకులతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఎసిబి విచారణలో ఉదయం నుంచీ ఒకటే ప్రశ్న తిప్పి తిప్పి అడిగారని మండిపడ్డారు. అసలు ఈ కేసులో అవినీతి ఎక్కడ ఉందని ఎసిబి అధికారులనే తానే ప్రశ్నించినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి జైలుకెళ్లినందుకు, తమల్నీ కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తమను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేస్తే చేసుకోండని ఎసిబి అధికారులకు చెప్పానని, అదే చేసి ఉంటే జైల్లో విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు. ఇలా తనపై వందల కొద్దీ కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడేది లేదని కెటిఆర్ తేల్చి చెప్పారు.

దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని తానంటే రావడానికి రేవంత్ రెడ్డికి ధైర్యం లేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. మొదటి సంవత్సరం ఫార్ములా రేసు విజయవంతం కావడంతో రెండవ సంవత్సరం కూడా ఎలాగైనా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని బిఆర్‌ఎస్ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగానే నిర్వహణ సంస్థ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించిన విషయాన్ని ఎసిబి అధికారులకు వివరించానని తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని తాను అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. అసలు కరప్షనే జరగని ఓ తుపేల్ కేసులో ఎసిబిని ఇన్వాల్వ్ చేయడాన్ని తన 26 సంవత్సరాల కెరీర్‌లో చూడనే లేదని మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డి రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే పొద్దుటి నుంచి అటుతిప్పి ఇటు తిప్పి ఎసిబి అధికారులు అడిగారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి అరెస్ట్ చెయ్యాలని ఒత్తిడి ఉంటే బేషుగ్గా చేసుకోవచ్చని అధికారులకు చెప్పానని తేల్చిచెప్పారు. అవసరమైతే తెలంగాణ కోసం మరోసారి జైలుకు వెళ్లడానికి కూడా సిద్దమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేవారు బిఆర్‌ఎస్‌లో ఎవరూ లేరని అన్నారు.

నోటీసులు రావడం పాత చింతకాయ పచ్చడిలా మారింది
కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదని కెటిఆర్ పేర్కొన్నారు. దద్దమ్మ రాజకీయాలతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసుల్లో తమకు నోటీసులు రావడం పాత చింతకాయ పచ్చడిలా మారిందని అన్నారు. బిఆర్‌ఎస్ కేడర్ వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. పెడితే ఒక 15 రోజులు తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందడం తప్ప ఇంకేం చేయలేడని తేల్చిచెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి జై తెలంగాణ అనకపోతే, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అని అంటే, ఢిల్లీకి పోతే అపాయింట్‌మెంట్ ఇస్తలేరు..దొంగను చూసినట్టు చూస్తున్నారంటే బరాబర్ రేవంత్ రెడ్డిని హౌలా అనే అంటామని కెటిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి కార్యక్రమాలు
2019 జూన్ 21 నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్, కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఫుట్‌బాల్ ఆడి చిత్తుచిత్తుగా ఓడించడం మీద బిఆర్‌ఎస్ నాయకులు దృష్టి పెట్టాలని అన్నారు. పొద్దుటి నుంచి ఓపికగా తనకోసం ఎదురు చూసిన ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ కార్యకర్తలు,నాయకులకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదు: కెటిఆర్
తనకు చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఎసిబి విచారణకు వెళ్లే ముందు మాజీ మంత్రి హరీష్‌రావు, బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కెసిఆర్, హరీష్‌రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, 30 సార్లు పిలిచినా విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు కూడా చేయవచ్చని, అయితే తెలంగాణ కోసం గతంలోనే జైలుకు వెళ్లి వచ్చానని వ్యాఖ్యానించారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఒక్కసారి కాదు వందసార్లయినా జైలుకు వెళ్తానని పేర్కొన్నారు. కానీ కెసిఆర్ లక్షల సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం మీకు ఉందా..? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫార్ములా -ఈ కార్ రేసులో ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డిపైన కూడా ఎసిబి కేసులు ఉన్నాయని, లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా..? అని కెటిఆర్ మరోసారి సిఎంకు సవాల్ విసిరారు. అక్రమ కేసులకు భయపడం అని, అరెస్ట్ చేసినా వెనక్కు తగ్గం అని స్పస్టం చేశారు. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

18 నెలల్లో కెటిఆర్‌పై 14 కేసులు పెట్టారు: హరీష్‌రావు ధ్వజం
సిఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కెటిఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఆరోపించారు. 18 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో కెటిఆర్‌పై 14 కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని పేర్కొన్నారు. మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని అన్నారు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్‌రెడ్డి ఏం చేయాలని ప్రశ్నించారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ ఫార్ములా రేసింగ్ కోసం పోటీపడుతుంటే కెటిఆర్ తన శక్తి యుక్తులను ఉపయోగించి ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా హైదరాబాద్‌కు ఫార్ములా ఈ రేసును తీసుకువచ్చారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News