Monday, June 9, 2025

నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్‌ రావు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సోమవారం కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ముందు హాజరుకానున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి హరీష్‌రావును కమిషన్‌ ప్రశ్నించనుంది. ఈనెల 6న కమిషన్ ముందు బిజెపి ఎంపి ఈటల రాజేందర్ హాజరైన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల నిర్మాణాలపై కమిషన్ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీష్ రావులతో పాటు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే, ఈనెల 5న కెసిఆర్ హాజరుకావాల్సి ఉండగా, వాయిదాను కోరుతూ తాను ఈనెల 11న విచారణకు హాజరవుతారని కమిషన్‌కు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News