Wednesday, May 21, 2025

కెసిఆర్‌ను ఫామ్‌హౌస్‌కు వెళ్లి కలిసిన హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు(KCR) కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కెసిఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు(Harish Rao), ఈటల రాజేందర్‌కు కూడా జస్టిస్ ఘోష్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈ పరిణామాల మధ్య కెసిఆర్‌ను.. హరీశ్‌రావు ఎర్రవెల్లిలో ఉన్న ఫామ్‌హౌస్‌కి వెళ్లి కలిశారు. నోటీసులు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. అయితే కెసిఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు(Harish Rao), ఆథిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 5న కెసిఆర్, 6న హరీశ్‌రావు, 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరుకావాల్సిందిగా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News