న్యూఢిల్లీ: 100 మిలియన్లకు పైగా కుటుంబాలు విశ్వసిస్తున్న ఇంటి పారిశుధ్యపు సొల్యూషన్లలో అగ్రగామి~ అయిన భారతదేశపు నెం.1 టాయిలెట్ మరియు బాత్ రూమ్ క్లీనర్ హార్పిక్, కింగ్ ఆఫ్ బాలీఉడ్ షారూఖ్ ఖాన్ కు తన బ్రాండ్ అంబాసిడర్ గా స్వాగతం పలకటం ద్వారా తన చరిత్రలో ఒక మైలురాయిని సగర్వంగా ప్రకటిస్తోంది. అత్యుత్తమ పరిశుభ్రత^ను అందించే హార్పిక్ యొక్క విశ్వసనీయమైన చరితను షారూఖ్ ఖాన్ కు ఉన్న అపారమైన ఆకర్షణ, ఒకే విధమైన విలువలు, భారతీయ కుటుంబాల్లో అపారమైన ప్రభావాన్ని ఈ శక్తివంతమైన భాగస్వామ్యం ఏకం చేస్తుంది.
ఒక శతాబ్దానికి పైగా హార్పిక్, పారిశుధ్యపు ప్రమాణాలను పునర్నిర్వచిస్తూ, అంతర్జాతీయంగా మార్గదర్శన చేసింది. నేడు, భారతదేశంలో ప్రతి 3 కుటుంబాల్లో~ 1 కుటుంబాన్ని చేరుకుని హార్పిక్, భారతదేశపు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల వ్యాప్తంగా కుటుంబాలను సశక్తీకరించి, ఒక శక్తివంతమైన, ప్రభావవంతమైన మరియు విశ్వసనీయమైన క్లీనింగ్ పరిష్కారమార్గాలను అందించటంలో కీలకమైన పాత్రను పోషించింది. షారూఖ్ ఖాన్ తో హార్పిక్ భాగస్వామ్యం, గౌరవమర్యాదలను, సంరక్షణను మరియు మెరుగైన పారిశుధ్యాన్ని ప్రతి భారతీయ కుటుంబానికి కల్పించటాన్ని ప్రోత్సహించే హార్పిక్ ప్రస్థానంలో ఒక కొత్త మైలురాయి కాగలదు.
బ్రాండ్ తో తన అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ షారూఖ్ ఖాన్ ఇలా అన్నారు, “పరిశుభ్రత చిన్న చిన్న అర్ధవంతమైన పనులతో ప్రారంభమవుతుంది. దశాబ్దాలుగా భారతీయ కుటుంబాల్లో పారిశుధ్యం మరియు డిగ్నిటీ విషయంలో విజయకేతనాన్ని ఎగురవేస్తున్న హార్పిక్ తో భాగస్వామ్యం నాకు గర్వకారణం. గుర్తింపు లేని హీరోలు – హోమ్ మేకర్ల పట్ల నాకు ఎంతో గౌరవం ఉన్నది. హోమ్ మేకర్ల నిబద్ధత~ కుటుంబాలు ఆరోగ్యం మరియు ఆనందంగా ఉండేందుకు దోహదం చేస్తుంటుంది. వారికి అత్యుత్తమమైనదానిని పొందే అర్హత ఉన్నది. హార్పిక్ హై నా తో, కేవలం అయిదు నిముషాల్లో లభించే అత్యుత్తమ పారిశుధ్యం ప్లస్ క్లీనింగ్ యాక్షన్^, ఎక్కువ సమయం నిలిచి ఉండే తాజాదనాలను ప్రతి కుటుంబం ఆశించవచ్చు. జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో కోరుకునే ఒక తిరుగులేని హామీ వంటి హార్పిక్ హై నా, ప్రతి కుటుంబానికి విశ్వసనీయమైన భాగస్వామిగా నిలుస్తుంది. ”
ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం ఆరంభానికి గుర్తుగా హార్పిక్, షారూఖ్ ఖాన్ తో “హార్పిక్ హై నా” అనే ఒక కొత్త TVC విడుదల చేయబోతున్నది. 10 రెట్లు మెరుగైన శుభ్రతను, 5-నిముషాల్లో శక్తివంతమైన డిజిన్ఫెక్షన్ మరియు ఎక్కువసేపు నిలిచే సువాసన^ను అందించే విషయంలో హార్పిక్ టాయిలెట్ క్లీనర్ ఆధిక్యతను ఇది చాటుతుంది. కేవలం డిటర్జెంట్లకు మెరుగైన ప్రత్యామ్నాయంగా కాక, సంపూర్ణమైన టాయిలెట్ పరిశుభ్రతకు ఒక పరిపూర్ణమైన పరిష్కారంగా హార్పిక్ స్థానాన్ని ఈ క్యాంపెయిన్ బలంగా చాటుతుంది.
ఈ క్యాంపెయిన్ ఇతివృత్తం “హార్పిక్ హై నా”, అత్యవసరమైన తరుణాల్లో శక్తివంతమైన, విశ్వసనీయమైన పరిశుభ్రతా పరిష్కారాలను అందించటం ద్వారా భారతీయ కుటుంబాలకు ఒక బలమైన వాగ్దానంగా నిలుస్తుంది. మనసును హత్తుకునే ఈ పిలుపుతో పాటు, హార్పిక్ యొక్క అత్యుత్తమమైన పనితీరు^ , పరిశుభ్రత కోసం ప్రతి కుటుంబం భరోసా పెట్టుకోగలిగిన ఒక విశ్వసనీయమైన పరిశుభ్రతా భాగస్వామిగా బ్రాండ్ యొక్క నిబద్ధతను మళ్ళీ చాటుతాయి.
చాలామంది హోమ్ మేకర్లు ప్రభావవంతమైన టాయిలెట్ పరిశుభ్రతకు ఉపకరించవని తెలియకే డిటర్జెంట్ల వంటి సాధారణ సొల్యూషన్లను ఉపయోగిస్తున్నారు. డిటర్జెంట్లను వదిలి, ప్రత్యేకంగా తయారు చేసిన, విజ్ఞానశాస్త్రపరంగా ఉత్తమమైన పరిష్కారమార్గం వైపుకు మళ్ళేలా వినియోగదారులను ప్రోత్సహిస్తూ, వారిలో నిర్ణయాత్మకమైన మార్పును తీసుకవచ్చేందుకు ఈ హార్పిక్ కొత్త క్యాంపెయిన్ సంకల్పించింది.
ఈ ప్రకటనను గురించి మాట్లాడుతూ, గౌతమ్ రిషి, మార్కెటింగ్ డైరెక్టర్, హైజీన్, రెకిట్ – దక్షిణాసియా, ఇలా అన్నారు, “హార్పిక్ కుటుంబంలోకి షారూఖ్ ఖాన్ కు స్వాగతం పలకటం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. లక్షలాది భారతీయులతో ఆయనకు ఉన్న అవినాభవ అనుబంధం, ఆయన నైతిక విలువలు – నమ్మకం, పనితీరు, సంరక్షణలతో కూడిన హార్పిక్ ప్రయాణానికి అద్దం పడతాయి. తనకు గల విజ్ఞానశాస్త్రబద్ధమైన ఆవిష్కరణల చరిత్ర, అత్యుత్తమ పరిశుభ్రతా సొల్యూషన్ల^ పట్ల తనకుగల నిబద్ధతలతో హార్పిక్, భారతదేశ వ్యాప్తంగా పరిశుభ్రత పరంగా అలవాట్లను మార్చివేసింది. గత 2 దశాబ్దాల కాలంలో మేము దేశంలోని 1/3వ వంతు కుటుంబాల~ విశ్వాసాన్ని చూరగొనగలిగాము. ఇప్పుడు మేము దేశంలోని సగం కుటుంబాలను చేరుకోవాలన్న సంకల్పాన్ని పూనాము. అత్యుత్తమ^మైన హార్పిక్ ఉత్పత్తితో, మరియు దాని యొక్క అవిశ్వసనీయమైన భాగస్వామ్యంతో మేము, టాయిలెట్ క్లీనింగ్ విషయంలో ప్రత్యేకమైన సొల్యూషన్ల ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించాలని, భారతీయ కుటుంబాల్లో హార్పిక్ ను విడదీయరాని భాగంగా చేయాలని సంకల్పించాము.”
షారూఖ్ ఖాన్ స్టార్ చేస్తూ రూపొందించి కొత్తగా విడుదల చేసిన TVCకి హవస్ క్రియేటివ్ ఇండియా వారు ఇతివృత్తాన్ని అందించి, దైనందిన జీవితంలో కుటుంబాలకు అనువర్తింపజేసుకోగలిగిన సందర్భాలను – ప్రభావవంతం కాని క్లీనింగ్ సొల్యూషన్లతో రోజూ పడే పాట్లను, హార్పిక్ టాయిలెట్ క్లీనర్ ఏ విధంగా త్వరగా, మెరుగైన పరిశుభ్రత^ను అందించగలుగుతుందో తెలియచేస్తూ – ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. మనుసును హత్తుకునే ఈ చిత్రీకరణ, దానితోపాటు శక్తివంతమైన ఉత్పత్తి పనితీరు, ప్రతి ఇంటికీ సందేశాన్ని స్పష్టంగా చేరవేస్తుంది: ప్రభావవంతమైన టాయిలెట్ క్లీనింగ్ విషయానికి వస్తే డిటర్జెంట్లు సరైన ఛాయిస్ కావు – హార్పిక్ హై నా.
అనుపమా రామస్వామి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ & ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ హవస్ ఇండియా ఇలా అన్నారు “ఇప్పటికే ఉన్న ప్రథమ స్థానం నుండి మరొక స్థాయి ఎగువకు తీసుకువెళ్ళమని మార్కెట్ అగ్రగామి హార్పిక్ అడిగితే, హవస్ క్రియేటివ్ ఏమి చేస్తుంది? మేము పెద్దగా కాదు, కింగ్ సైజ్ లో ఆలోచిస్తాము. కింగ్ ఖాన్ నే రంగంలోకి తీసుకురమ్మని మేము సూచించాము! ప్రతి హోమ్ మేకర్ కి షారూఖ్ ఖాన్ చేరువ అయ్యే విధంగా, వారి జీవితాన్ని హార్పిక్ ఆధిక్యత^తో సులభతరం చేసే విదంగా అనుబంధమైన మరియు ఆకర్షణీయమైన క్యాంపెయిన్ ను మేము తయారు చేశాము. తనదైన శైలిలో షారూఖ్ ఖాన్ ఆకట్టుకునే విధంగా – హార్పిక్ హై నా! అని చెబుతారు”
హార్పిక్ ప్రస్థానంలో ఈ భాగస్వామ్యం ఒక సాహసోపేతమైన అధ్యాయానికి నాంది పలుకుతుంది – ఇందులో విశ్వసనీయమైన హార్పిక్ చరిత్రను ఆధునికతతో రంగరించి, భారతీయ కుటుంబాలు మరింత ప్రభావవంతమైన పరిశుభ్రతా సొల్యూషన్ల^ను ఎంచుకునేందుకు ప్రోత్సహించటం జరుగుతుంది.