Thursday, July 10, 2025

బ్రూక్‌కు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. రెండో టెస్టులో పరుగుల వరద పారించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో గిల్ ఏకంగా 15 ర్యాంక్‌లను మెరుగు పరుచుకోవడం విశేషం. బ్రూక్ 886 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రెండో స్థానానికి పడిపోయాడు. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

గిల్ అనూహ్యంగా టాప్10లో చోటు సంపాదించాడు. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి 8వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో టీమిడియా స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా అగ్రస్థానాన్ని కాపాడు కోవడంలో సఫలమయ్యాడు. తొలి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేయడంతో బుమ్రా టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. బుమ్రా 898 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కగిసొ రబడా (సౌతాఫ్రికా) రెండో, పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) మూడో, జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) నాలుగో, నొమన్ అలీ (పాకిస్థాన్) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News