Sunday, July 6, 2025

గిల్‌ను కవ్వించిన బ్రూక్.. దిమ్మతిరిగిపోయే జావాబిచ్చిన భారత కెప్టెన్

- Advertisement -
- Advertisement -

టెస్ట్ క్రికెట్‌లో స్లెడ్జింగ్ సర్వసాధారణమే.. ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టేందుకు అవతల టీమ్ వాళ్లు స్లెడ్జింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు సరదాగా ఉన్నా.. కొన్నిసార్లు తీవ్ర ఘర్షణకు దారి తీస్తాయి. అలాంటి ఓ సరదా ఘటనే భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిపత్యాన్ని సాధించింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill), రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ రాణించడంతో 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కష్టాల్లో పడేసింది.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో గిల్-పంత్‌లు కలిసి నాలుగో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో భారత్ 450 పరుగుల ఆధిక్యాన్ని తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ గిల్‌ని (Shubman Gill) కవ్వించే ప్రయత్నం చేశాడు. ‘‘450 పరుగులు చాలు.. డిక్లేర్ చేయండి.. ఐదో రోజు వాన పడితే సగం రోజు వేస్ట్ అవుతుంది’’ అని అన్నాడు. దానికి గిల్ దిమ్మతిరిగిపోయే జవాబిచ్చాడు. ‘‘సర్లే.. అది మా బ్యాడ్ లక్ అనుకుంటాం’’ అని అన్నాడు. దానికి బ్రూక్ ‘‘డ్రా తీసుకోండి’’ అని పేర్కొన్నాడు. దాన్ని పట్టించుకోకుండా గిల్ నవ్వుతూ బ్యాటింగ్ చేశాడు. ఈ సంభాషణ అంతా స్టంప్‌ మైక్‌లో రికార్డ్ అయింది. ఆ తర్వాత అద్భుతమైన శతకం సాధించి.. ప్రత్యర్థి జట్టుకు 608 పరుగుల టార్గెట్‌ను ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News