Friday, July 11, 2025

హెయిర్ కట్టింగ్ వివాదం.. ప్రిన్సిపాల్ను పొడిచి చంపిన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

హెయిర్ కట్టింగ్ చేసుకోలేదని మందలించిన పాఠశాల ప్రిన్సిపాల్‌ ను ఇద్దరు విద్యార్థులు దారుణంగా పొడిచి చంపారు. ఈ విషాద సంఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్నాండ్ ప్రాంతంలో బాస్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్.. జుట్టు కత్తిరించకపోవడం, క్రమశిక్షణను పాటించకపోవడంతో విద్యార్థులను మందలించారు. ఓ ఇద్దరు విద్యార్థులు చెప్పినా వినకపోవడంతో.. ప్రిన్సిపాల్ వారిని తిడుతూ బయటకు లాగారు. దీంతో కోపంతో రెచ్చిపోయిన విద్యార్తులు కత్తితో ప్రిన్సిపాల్ పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మరణించిన వ్యక్తిని స్కూల్ ప్రిన్సిపాల్‌ జగ్బీర్‌సింగ్‌(50)గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం హిసార్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు హన్సి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) అమిత్ యశ్వర్ధన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News