మెదక్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. అనంతరం భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శమ్నాపూర్ గ్రామంలో మైలి శ్రీను, లత అనే దంపతులు నివసిస్తున్నారు. లత అదే గ్రామానికి చెందిన మల్లేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల గొడవలు జరిగాయి. పెద్దమనుషులు పలుమార్లు ఇద్దరు నచ్చి జెప్పి కాపురం చేసుకోవాలని సూచించారు.
అక్రమ సంబంధానికి భర్తగా అడ్డుగా ఉండడంతో అంతం చేయాలని భార్య ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. అదే గ్రామానికి చెందిన మోహన్‌తో 50 వేల రూపాయలు ఇచ్చి హత్యకు ప్లాన్ వేశారు. గత నెల 16 తేదీన శ్రీనును మద్యం తాగుదామని అనంతసాగర్ అటవీ ప్రాంతంలో తీసుకెళ్లాడు. ఇద్దరు మద్యం తాగిన తరువాత శ్రీను తలపై మోహన్ బీరు సీసాతో కొట్టాడు. శ్రీనును హత్య చేశానని మల్లేష్‌కు ఫోన్ చేసి మోహన్ తెలిపాడు. లత తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తనదైన శైలిలో దర్యాప్తు చేశారు. లతకు ప్రియుడు ఉన్నాడని తెలియడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.