8న విధివిధానాలు ఖరారు
ఉద్యోగుల జెఎసి నేతలతో జరిగిన
భేటీలో కేబినెట్ సబ్ కమిటీ హామీ
త్వరలో పెండింగ్ బిల్లులు క్లియర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉద్యోగుల హెల్త్ కా ర్డు లు త్వరలో మంజూరు అవుతాయని , ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్ర భుత్వం చర్చలు జరిగినట్లు తెలంగాణ ఎంప్లాయిస్ జా యింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావులు తెలిపారు. ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కో సం రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు మంగళవారం స చివాలయంలో రాష్ట్ర కాబినెట్ సబ్ కమిటి , అధికారుల కమిటితో తెలంగాణ ఎంప్లొయీస్ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. పెండింగ్ సమస్యల పరిష్కారం లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క , ఐటీ, పరిశ్రమల శాఖల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి – రామ కృష్ణారావు ఆధ్వర్యంలోని నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ సుల్తానియా, బి. ఎం.డి. ఏక్కా, లోకేష్ కుమార్, క్రిస్టినా చోంగ్తు, రఘునందన్ రావు, కృష్ణభాస్కర్ అధికారుల కమిటీతో తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావులు మీడియాతో మా ట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో ఏ దురుచూస్తున్న నగదు రహిత చికిత్స కొరకు హెల్త్ కా ర్డులు మంజూరు చేస్తామని 8న ఈ విషయంలో సీఎస్ రామకృష్ణరావుతో ప్రత్యేక భేటీ ఉందని తెలిపారు. అధికారుల కమిటీ చర్చించి విధి విధానాలతో ఉత్తర్వులు జారీ చేస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ. 700 నుంచి 750 కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామని, నర్సింగ్ డైరెక్టరేట్‌ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామ ని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిపారు. విజిలెన్స్ , ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులో రెండు సంవత్సరాలకు పైగా సస్పెన్షన్‌లో ఉన్నవారికి క్రమంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ప్రభు త్వం వేరు వేరు కాదని, సుపరిపాలన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చినట్లు తెలిపారు. అధికారుల కమిటీతో ఉద్యోగుల జేఏసి తో ప్రతి అంశంపై సానుకూలమైన వైఖరితో చర్చలు జరిగాయని జేఏసీ నాయకులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుండో కోరుతున్న నగదు రహిత చికిత్స కొరకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని దీని కోసం సెప్టెంబర్ 8న ప్రధాన కార్యదర్శి – రామ కృష్ణారావు జేఏసీ తో అధికారుల కమిటీ చర్చించి విధి విధానాలతో ఉత్తర్వులు జారీచేస్తామని ఖచ్చితమైన హామీ ఇ చ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కా రం కోసం వారితో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపిందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వేరు వేరు కాదని, సుపరిపాలన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన కార్యదర్శి పి. దామోదర్ రెడ్డి, సహ-ఛైర్మన్ చావా రవి, వంగ రవీందర్ రెడ్డి, ఎ. సత్యనారాయణ, డాక్టర్ జి. సురేష్ కుమార్, డిప్యూ టీ సెక్రటరీ జనరల్ జి. స్థితప్రజ్ఞ ప్రజ్ఞ, కస్తూరి వెంకటేశ్వర్లు, బి. శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.