Saturday, September 6, 2025

హృదయవేదన మరణమృదంగం

- Advertisement -
భారతదేశంలో గుండె జబ్బుల ద్వారా 31 శాతం మరణాలు సంభవిస్తున్నాయి అని ఆశ్చర్యకరమైన విషయాలు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఒకప్పుడు మన దేశంలో అంటువ్యాధుల వల్ల జనాలు ఎక్కువగా చనిపోయేవాళ్లు.. ఈ గుండె జబ్బులు అనేది అత్యంత సంపన్న దేశాలలో మాత్రమే ఉండేది.. మనది ఎదుగుతున్న దేశం కాబట్టి మనలో అంటూ వ్యాధులు అనేటివి ఎక్కువ ఉండేటివి. ఇప్పుడు మనదేశంలో కూడా టాప్ పొజిషన్ లోకి గుండెజబ్బుల వల్ల మరణాలు వచ్చాయి అని అంటే మన మారుతున్న జీవనశైలి ప్రభావమా?.
ఒకటి అంతో ఇంతో డెవలప్మెంట్ కావడం వలన కొంత గృహ నిర్మాణం పెరగడం శానిటేషన్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం మనకు అంటువ్యాధులు అనేటివి కొంత తగ్గుముఖం పట్టడం ఒక కారణమైతే, రెండవ కారణం మారుతున్న జీవనశైలి వలన గుండెజబ్బు మరణాలు పెరగడం జరిగింది.  డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా ఇండియా మారిపోయింది.. ఒక సర్వే ప్రకారం 60% ప్రజలు మన భారతదేశంలో డయాబెటిస్ తో బాధపడుతున్నారట.. అత్యధికంగా కార్బోహైడ్రేట్ ఆహారం మన భారతీయ ఆహారంలో ఒక భాగంగా ఉండడం ఒక కారణమైతే శారీరక శ్రమ తగ్గడం, క్రమబద్ధమైన నడక వ్యాయామం లేక జీవనశైలి లేకపోవడం కూడా ఒక కారణంగా ఉంది..
అంతేకాకుండా విపరీతమైన ఒత్తిడి వలన బిపి పెరగడం అనేది చాలా సాధారణ అయిపోయింది.. దానికి తోడు ఈ ధూమపానం మద్యపానం అనేది విపరీతంగా పెరిగిపోయింది.. దీనిమీద కంట్రోల్ చేసే వ్యవస్థ అనేది మనకు లేదు..
అన్ని దేశాలలో ఇవి ఆదాయ వనరుగానే చూస్తున్నారు కానీ వీటి వలన ఎంతమంది ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది దానిని బాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆలోచించడం లేదు.. దీనివలన మన ప్రొడక్టివిటీ పడిపోయి చాలా తక్కువ కాలానికి ఎక్కువ మనుషులు చనిపోవడం వలన ప్రొడక్షన్ గా పనికి వచ్చే మనుషుల ఆయుర్దాయం తగ్గిపోతుంది..
ఇక రాబోయే కాలంలో గుండె జబ్బు మరణాలు క్యాన్సర్లే ఎక్కువ మందిని మృత్యువాత పడేటట్లు చేస్తాయి. దీని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్, అంటువ్యాధులు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆసుపత్రిలో చేరడం వలన వచ్చే ఇన్ఫెక్షన్స్, మెడికల్ తప్పిదాల వలన వచ్చే అయాట్రోజెనిక్ డిసీజెస్ కూడా ప్రధాన కారణం అని తెలుసుకోవాలి. ఒకప్పుడు మనిషి సగటు ఆయుర్దాయం 54 నుంచి 60 ఉండగా ఈ మధ్యకాలంలో పెరిగిన మెడికల్ ఫెసిలిటీస్ వలన అది 68 నుంచి 72 కు పెరిగింది. కానీ మరలా ఈ విధంగా గుండె జబ్బుల మరణాలవల్ల ఆయుర్దాయం తగ్గిపోయి ఆవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది ఏమో?
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News