వయసుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఇటీవలి కాలంలో పిల్లల గుండెపోటు మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతను అద్దంపడుతోంది. రోజూ ఎక్కడో ఓకచోట అలాంటి ఘటనలు నమోదవుతునే ఉన్నాయి. యువతతో పాటు పిల్లలకూ ఈ ముప్పు పెరిగిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లా కోడోలి గ్రామంలో అటలాడుకునే పదేళ్ల బాలుడు సంభవించడంతో ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లి గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థిని శ్రీనిధి(14) పాఠశాలకు వెళ్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు ఏమైందో చూసి ఆసుపత్రికి తరలించి సిపిఆర్ చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటన ఈఏడాది ఫిబ్రవరి 20వ తేదీన చోటుచేసుకుంది. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలతో పిల్లలు గుండెపోటు బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
-పిల్లల్లో ఆటలు ఆడటంతో శారీరక శ్రమ పెరిగితే పిల్లలకు గుండెపోటు ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలతో రోజూ తేలికపాటి వ్యాయామాలు చేయించడం, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని చెబుతున్నారు. పిల్లలు తప్పకుండా క్రీడలు, ఇతర యాక్టివిటీలలో పాల్గొనే ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. పిల్లలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతుండటం, త్వరగా అలసట గురవుతుండటం వంటి లక్షణాలు కనిపించినా, మధుమేహం వంటి వ్యాధులు ఉన్న వారి పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉంటూ రెగ్యులర్ వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మారుతున్న పరిస్థితులతో ఎక్కువ మంది చిన్న వయసులో అధిక రక్తపోటు, మధుమేహం బారిన పడుతుండటం గుండెపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్య ఉన్న పిల్లలు గుండెపోటు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి వారి పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.