Thursday, September 11, 2025

గొంతు ద్వారా గుండె కవాట మార్పిడి

- Advertisement -
చాతి ద్వారా ధర్నం స్టెర్ర్నం బోన్ ని కట్ చేసి గుండెలోని అయోర్టిక్ కావటాన్ని మార్చడం అనేది సాధారణంగా జరిగే ఆపరేషన్ పధ్దతి.. దీని తర్వాత పేషెంట్ కు ఎక్కువ నొప్పి ఉండకూడదు అని మినీ స్టెర్నాటమి అని, ఎంఐసిఎస్ అని, ట్రాన్స్ ఆక్సిలరీ ఎంఐసిఎస్ అని రకరకాల చిన్న కోత ఆపరేషన్లు వచ్చాయి.. ఇప్పుడు అసలు ఛాతి మీదనే స్కార్స్ లేకుండా స్టెర్న్నం బోన్ ను కట్ చేయకుండా గొంతు నుంచి అయోర్టిక్ కావాటాన్ని మార్చే పద్ధతిని అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ క్లినిక్ వైద్యులు ఓ నలుగురు పేషంట్ల పైన రోబోటిక్ పధ్దతిలో చేశారు..
మొదట ఓ 20 మంది డెడ్ బాడీల మీద ఈ ప్రయోగం చేసి తరువాత దీనిని నలుగురు పేషంట్ల 60 నుంచి 70 వయసు ఉన్న వారి మీద చేయగా నలుగురికి సక్సెస్ అయ్యింది.. వారిలో ఒక పేషెంట్ ఐదు రోజులకే డిశ్చార్జ్ అయ్యి 15 రోజులకే జిమ్ కూడా వెళ్ళాడట. కానీ ఇది ఇంకా కొంతమంది మీద ప్రయోగించిన తర్వాత చాలామందికి ఉపయోగపడేటట్లు ఈ రోబోటిక్ గొంతు ద్వారా అయోటిక్ మార్పిడిని ప్రజలకు విరివిగా ఉపయోగిస్తారట.
ఏదైనా కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు రోజూ ఒక పద్ధతి అనేది ప్రజలకు ఉపయోగంలోకి వస్తుంది.. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఏదో ఒక రూపంలో వస్తే కానీ ప్రజలు డబ్బులు ఇవ్వరు. భారతదేశం లాంటి ఇంకా చాలా దేశాలలో ఈ చిన్న కోత ఆపరేషన్లే ప్రజలకు అందుబాటులో లేవు. ఇంకా ఇటువంటివి అన్నీ కూడా ఖరీదైన ఆపరేషన్లు సాధారణ ప్రజలకు ఎండమావే..
మన దేశం లాంటి దేశాలలో వైద్యో నారాయణో హరి అని వైద్యం ఉచితంగా కావాలి లేదా చాలా చౌకగా కావాలి అనుకునే కంట్రీస్ లో ఇటువంటి ఆవిష్కరణలు ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ డబ్బున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి..
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News