Saturday, July 12, 2025

మరో ఐదు రోజులు తెలంగాణలో వడగాలులు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న రోజుల్లో తెలంగాణలోని అనేక జిల్లాల్లో వడగాలులు వీచనున్నాయని, మండే ఎండలు కాయనున్నాయని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(టిఎస్‌డిపిఎస్) హెచ్చరిక జారీ చేసింది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత ఐదు రోజులపాటు ఉండగలదని తెలిపింది.

జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, కుమురం భీమ్, భద్రాద్రి కొతగూడెం, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటనుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News