- Advertisement -
ప్రముఖ దేవాలయం ఏడుపాయల టెంపుల్ వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వరదనీరు దేవాలయం పైవరకు చేరుకుంది. వరద పొటెత్తడంతో దేవాలయం వైపు భక్తులు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం వరదల్లో చిక్కుకుంది. జిల్లాల్లోని పలు గ్రామాలు, తండాలను వరద ప్రవాహం ముంచెత్తింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
- Advertisement -