Sunday, August 17, 2025

ఏడుపాయల ఆలయం జలదిగ్బంధం

- Advertisement -
- Advertisement -

ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు నుంచి 5 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో మెదక్ జిల్లా నాగ్సాన్‌పల్లి గ్రామ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని మాత ఆలయం గత నాలుగు రోజులుగా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆదివారం నాటికి నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగి,ఏడుపాయల గుండా పొంగిపొర్లడంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. ప్రధాన ఆలయం లోపలికి వరద నీరు చేరింది. భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలు లేకపోవడంతో అధికారులు తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేశారు. ప్రస్తుతం భక్తులు ఆలయ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయం ముందు ఉదృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది దృశ్యాలను భక్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు. భద్రత చర్యల్లో బాగంగా ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నది పరిసరాలకు ప్రజలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News