Thursday, August 21, 2025

జూరాలకు పెరుగుతున్న వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /గద్వాల ప్రతినిధి:ఎగువ ప్రాంతంలోని మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.460 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.882 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో జూరాల అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. గురువారం ఎగువ జలాశయాల నుంచి జూరాలకు 3,65,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

కృష్ణానది వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జూరాల అధికారులు ప్రాజెక్టు 41 గేట్లను ఎత్తివేసి 3,80,635 పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాలపై ఆధారపడిన కుడి కాలువకు 320, ఎడమ కాలువకు 550 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News