Friday, July 11, 2025

నాగార్జునసాగర్‌కు భారీగా వరద

- Advertisement -
- Advertisement -

కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో నీటి ప్రాజెక్టులు కల కల లాడుతున్నాయి. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదులుతున్నారు. జూరాల నుంచి లక్షా 25వేల క్యూసెక్కుల పైగా వరద వస్తోంది. జూరాల ప్రాజెక్ట్ కు సంబంధించి14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదులున్నారు. ఈ ప్రాజెక్ట్ కు 1 లక్ష 15 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. మరోవైపు అదే కంటే ఎక్కువగా 1 లక్షా 26 వేల 017 క్యూసెక్కుల ఔట్ ఫ్లోగా దిగువకు ఒదిలేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం..317.560 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు (శతకోటి ఘనపుడగులు)గా ఉంది. ప్రెజెంట్ నీటి సామర్ధ్యం 7.759 టీఎంసీలు (శతకోటి ఘనపుటడుగులు) గా ఉంది.

జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. మూడు రేడియల్ క్రస్టు గేట్లు పది అడుగుల మేర ఎత్తి కిందికి ఒదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో : 1,72,829 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 1,48,625 గా ఉంది. శ్రీశైలం ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం: 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 882.70 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 215.8070 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 202.9673గా టీఎంసీలుగా ఉంది. ఇక కుడి, ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద ప్రవాహంఅటు శ్రీశైలం ఎగువ ప్రాజెక్టులు తుంగభద్రతో పాటు.. సుంకేసుల ప్రాజెక్టులు కూడా నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. సుంకేశుల ప్రాజెక్ట్ 13 గేట్లు ఎత్తారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు 55 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. 51,402 క్యూసెక్కుల ఔట్ ఫ్లోగా ఉంది. పూర్తి ప్రాజెక్ట్ నీటి సామర్ధ్యం 1.2 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 0..608 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర, సుంకేశుల, జూరాల ఆపై శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. సాగర్ కు ఎగువ నుంచి లక్షా 20వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నిలకడగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News