Monday, August 11, 2025

17వరకు వానలే..వానలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలో 17వ తేదీ వరకు భారీ వ ర్షాలు కురుస్తాయని భారత వాతవరణ కేం ద్రం వెల్లడించింది. 13వ తేదీ వరకు పశ్చి మ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో భారీ నుం చి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పలు జి ల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిం ది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం, మ ధ్యాహ్నాం ఎండతో కూడిన వాతావరణం ఉండగా, సాయంత్రం, రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. శనివారం రాత్రి అత్యధికంగా హైదరాబాద్‌లో అంబర్‌పేటలో 11 సెంటిమీటర్లు, హిమాయత్‌నగర్‌లో 10 సెంటిమీటర్ల వర్షపాతం

కురిసిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కాగా, సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్క భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు 14, 15 తేదీలలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలతో పాటు 15 జిల్లాలకు ఆరెంజ్, 16, 17వ తేదీల్లో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఆదివారం రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాద్‌లోని అంబర్ పేటలో 105.2 మిల్లీమీటర్లు, హిమాయత్‌నగర్‌లో 98 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో అత్యవసరమైతేనే బయటకు రావాలని జిహెచ్‌ఎంసి అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News