Sunday, May 4, 2025

ఢిల్లీలో భారీ వర్షం… 100 విమానాలు దారి మళ్లింపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భారత దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్‌సి ఆర్ ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారయి. వర్షం కురవడంతో ఢిల్లీ వాసులు కాస్త ఉపశమనం లభించింది. వారం రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వంద విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంతో మరో 40 విమానాలను అధికారులు దారి మళ్లించారు. రానున్న 24 గంటల్లో కూడా ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. బలమైన గాలులు వీయడంతో చెట్లు కూలి వాహనాలపై పడ్డాయి. వందల వాహనాలు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News