మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మెదక్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో కుండపోతవర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్ జిల్లాలో వ ర్షం బీభత్సం సృష్టిస్తోంది. 4 గంటల వ్యవధిలో 17 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. ఆర్‌డీఓ కార్యాల యం వద్ద 176 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదవగా రాజ్‌పల్లిలో 132 మి ల్లీమీటర్లు మేర కురిసింది. అటు కు ల్చారం, పాతూర్, హవేలీఘన్‌పూర్, ఎల్దుర్తి, రామాయంపేట్‌లో భారీ వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో మెదక్‌లో వర్షప్రభావం తీవ్రం గా కనిపించింది. మెదక్ పట్టణం లో అతి భారీ వర్షం కురవడంతో పట్టణంలోని రోడ్లు అన్నీ చెరువులను తలపిస్తూ జలమయం అయ్యాయి. వాహనదారులు,ప్రయాణికులు తీవ్ర ఇబ్బం ది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీ గా వరద నీరు చేరింది. మెదక్‌లోని గాంధీనగర్ కాలనీ, సాయినగర్ కాల నీ వెంకట్రావు నగర్ కాలనీ, ఫతే నహ ర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
పలుఇళ్లల్లోకి, వ్యాపార సముదాయాల్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షం కారణంగా పలు దుకాణ సముదాయాల ముందు ఉంచినవాహనాలు నీట మునిగాయి. రాందాస్ చౌరస్తా వ ద్ద డివైడర్‌ను జేసీబీ సహాయంతో ము న్సిపాలిటీ సిబ్బంది కూలగొట్టడం తో వరద నీరు బయటకు వెళ్తోంది. మె దక్‌లోని బాలికల కళాశాలను వరద నీ రు ముంచెత్తడంతో మోకాళ్ల లోతు నీళ్ల నుంచి లెక్చరర్ల సహాయంతో విద్యార్థు లు బయటకు వచ్చారు. మెదక్ జిల్లాలోని కుల్చారంలో 8.7 సెంటీమీటర్లు, పాతూర్‌లో 8.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హవేలీఘన్‌పూర్ మండలం నాగపూర్‌లో 6.4, ఎల్దుర్తి మండలం దామరంచలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ – మెదక్ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో చెరువును తలపిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
బోధన నియోజకవర్గ వ్యాప్తంగా మోస్తరు వర్షం
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా మోస్తారు వర్షం కురిసింది. గురువారం వేకువజాము నుంచి నియోజకవర్గంలోని బోధన్‌తో పాటు ఎడపల్లి, రెంజల్ మండలాలలో మోస్తారు వర్షం కురిసింది. తేలికపాటి వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారింది.
జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా…
జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. మొత్తం 445.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటు వర్షపాతం 34.2 మిల్లి మీటర్లుగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాలూరు , తిమ్మనాదొడ్డిలో 70.5 మి.మీ , ధరూర్లో 4.8 మి.మీ, ,గద్వాల్లో 1.7 మి.మీ, ఇటిక్యాల్లో 17.7 మి.మీ , మల్దకల్లో 21.7 మి.మీల వర్షం కురిసిందని వివరించారు. ఘట్టులో 87.5 మి.మీ,ఐజాలో 52.5 మి.మీ ,రజోలిలో 62.8 , వడ్డేపల్లెలో 46.9 , మనోపాడ్లో 32.1 , ఉండవెల్లిలో 14.2 , అలంపూర్లో 22.9 , ఎర్రవల్లిలో 9.7 మి.మీ వర్షపాతం నమోదయ్యిందని పేర్కొన్నారు.
కొనసాగుతున్న రుతుపవన ద్రోణి..రాష్ట్రంలో నాలుగు రోజులు పాటు వర్షాలే వర్షాలు
ఆగ్నేయ దిశలో తూర్పు బంగాళాఖాతంలో రుతువన ద్రోణి కొనసాగుతుందని, దీంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబాబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో మూడు రోజలు పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది.
Also Read:ఆసియా కప్ 2025: హాంకాంగ్‌పై బంగ్లాదేశ్ విక్టరీ
వర్షాలకు కూలిన కలెక్టర్ భవనం పైకప్పు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనంలోని పురాతన గది పై కప్పు కూలింది. గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న కలెక్టర్ వెనుక భాగం కూలిపోయింది. అతి పురాతన నిజాం కాలం నాటి భవనం ఉండడం వల్ల కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేక పోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. జిల్లా పాలనాధికారి ఉండే, జిల్లాకు సంబంధించి వివిధ రికార్డులు భద్ర పరిచే కార్యాలయాన్ని పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టి లో పెట్టుకుని పాత భావననికి మరమ్మతులు చేయించకపోవడం కొసమెరుపు.
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపధ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్,పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం సూచించారు. వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలపైన అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.