Friday, July 25, 2025

అస్తవ్యస్తం

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం పలు జిల్లాల్లో లోతట్టు
ప్రాంతాలు జలమయం పొంగిపొర్లిన వాగులు, వంకలు పెరిగిన
వరద ఉధృతి నీటమునిగిన పంట పొలాలు ములుగు జిల్లాలో
అత్యధికంగా 258మిల్లీమీటర్ల వర్షపాతం అనేక చోట్ల నిలిచిపోయిన
రాకపోకలు ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం సందర్శకులకు
అనుమతి నిరాకరణ పిడుగుపాటుతో యువకుడి మృతి ఖమ్మం
జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో వరదల్లో చిక్కుకున్న
వ్యవసాయశాఖ అధికారి కారు పరవళ్లు తొక్కుతున్న తాలిపేరు
ప్రాజెక్టు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు భూపాలపల్లి,
ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యా యి. రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. అత్యధికంగా ములుగు జిల్లాలో బుధవారం 258.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమో దవ్వగా, అత్యల్పంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 189 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పోర్లా యి. ఎడతెరపి లేని కురుస్తున్న వర్షంతో ఆయా జిల్లాలలో కుంటలు, చెరువులు నీట మునగాయి. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేనప్పటికీ నానా అగ చాట్లు పడి రైతన్నలు నాట్లు వేసుకున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షంతో పంట నీట మునగ డంతో రైతన్నల పరిస్థితి వర్ణనాతీతమవ్వగా, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, ఖమ్మం ,

మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, కామారెడ్డి, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో భారీ వర్షానికి ప్రజానీకం పలు అవస్థల పాలయ్యారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం దూప్‌సింగ్ తాండకు వెళ్లే వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధూప్‌సింగ్ తండా నుండి హవేలిఘన్‌పూర్ మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మద్ది కుంట చెరువు నిండి మత్తడి పడుతుంది. ఈ వరదలకు వేసిన వరి పంటలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా గ్రామానికి చెందిన లకావత్ నాజ నాయక్ పూరి గుడిసె ఇల్లు గోడ కూలింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్, మండల పరిధి లోని పామెన, చన్‌వెళ్లి, బస్తేపూర్, ఖానాపూర్, రేగడిఘనాపూర్, దేవరంపల్లి గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది. దేవరంపల్లి వాగు పొంగి పొర్లింది. దేవరం పల్లితో పాటు షాబాద్

మండలం తాళ్లపల్లి మీదుగా వెళ్లే ఈసి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షానికి మూసి వాగు పరవాలు తొక్కుతూ హిమాయత్ సాగర్ లోకి భారీగా నీరు చేరుతోంది. కారు మునిగిపోగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండల వ్యవసాయశాఖ అధికారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వేంసూ రు మండల పరిధిలోని మర్లపాడులోని అంబేద్కర్ నగర్ కాలనీలో మంగళ వారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కంచర్ల గిరిబాబు అనే వ్యక్తికి చెందిన ఇల్లు ముంపునకు గురైంది. భారీ వర్షంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలోని పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. సమత్ బటు ్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బూడిద వాగు బ్రిడ్జి కోతకు గురైంది. పినపాకలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని అనేక రహదారులు, పలు ఇల్లు, పంట పొలాలు నీట మునిగాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలో కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దిందా, శివపెల్లి, బాబా సాగర్, నాయకపుగూడ గ్రామాల సమీపంలోని వాగులు ఉదృతం గా ప్రవహించి బాహ్య ప్రపంచానితో సంబంధాలు తెగిపోయాయి.

మరో నాలుగు రోజులు వర్షాలే వర్షాలు
గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ద్రోణి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురుస్తాయని, గంట కు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News