భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు పలుచోట్ల కొట్టుకు
పోయిన రహదారులు జనజీవనానికి ఆటంకం దివిటిపల్లిలో
అమరరాజ కంపెనీ ఉద్యోగులకు తప్పిన ముప్పు మంజీరాకు
వరద ఉధృతి హైదరాబాద్ జంట జలాశయాలకు పోటెత్తిన
వరద హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తివేత సురక్షిత ప్రాంతాలకు
లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో మూడు రోజులు భారీ
వర్ష సూచన అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు
అన్ని విభాగాలకు సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/సిటీబ్యూరో/గండిపేట్: గ్రేటర్ పరిధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగర శివారులోని జంట జలాశయాలకు వరద ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ము ఖ్యంగా గ్రేటర్ నగర వాసుల దాహర్తినితీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయా లు నిండకుండలా మారాయి. ఈ జంట జలాశయాల ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి, శంకర్ పల్లి, అనంతగిరి హి ల్స్ తదితర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొం గి ప్రవహిస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్ లోకి సుమా రు 20 వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా చేరుతుంది. రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరటంతో అధికారులు గురువా రం ఉ.10 గంటలకు నాలుగు గేట్లు, ఆ తర్వాతి గంటకు మరో రెండు ఆ తర్వాత మరో గేటు ఇలా మొత్తం 8 గేట్లు మూడు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను ఎత్తి 12,050 క్యూసెక్కుల నీటిని దిగువనున్న మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు.
సురక్షిత ప్రాంతాలకు..
హిమాయత్ సాగర్‌కు చాలా సమీపంలోనున్న బండ్లగూడ జాగీర్‌లోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలొకి వరదనీరు రావటంతో అక్కడి స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా రు. బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, అత్తాపూ ర్, పురానాపూల్, నయాపూల్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుం ది. జియాగూడపురానాపూల్ రహదారిని మూ సివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా.. పోలీసులు వాహన రాకపోకలను నిలిపేశారు. మూసీ పరివాహాక ప్రదేశాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులు ఎప్పటికపుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చోట లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో అదికారలు నిమగ్నమయ్యారు.
రాజేంద్రనగర్ లో చేపలు పట్టేందుకు మూసీనదీలోకి వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో చిక్కుకోగా, అధికారులు రక్షించారు. ఉ.9 గంటల ప్రాంతంలో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను నాలుగు ఫీటు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయగా, మధ్యాహ్నాం తర్వాత ఇన్ ఫ్లో 1000 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 19000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, 12046 క్యూసెక్కుల అవుట్ ఫ్లోగా వరదనీరు చేరుతుంది. మరోవైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ కు 2800 క్యూసెక్కుల వదర నీరు వస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.919 టీఎంసీలుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.50 అడుగులకు నీటి మట్టం చేరినట్లు కూడా తెలిపారు.