Saturday, August 30, 2025

2 లక్షల ఎకరాల్లో పంట నష్టం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత కొ న్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణం గా తీవ్రస్థాయిలో పంటనష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ శాఖ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో 28 జిల్లాల్లో 1,43,304 మంది రైతాంగానికి సంబంధించిన 2 లక్షల 20వేల 443 ఎకరాల్లో పంట న ష్టం వాటిల్లగా, ఆరువేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు వ్యవసాయ శాఖ నివేదిక రూపొందించింది. మొత్తంగా 28 జిల్లాల్లో 270 మండలాల పరిధిలోని 2,463 గ్రామాలలో పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. పంట నష్టం జరిగిన జిల్లా ల్లో అత్యధికంగా కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పంటనష్టం తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా అత్యధికంగా ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 54,223 మంది రైతులకు చెందిన 77 వేల 394 ఎకరాల్లో పంటల నష్టం జ రిగిందని పేర్కొన్నారు. ఈ జిల్లాలో ఎక్కువగా వరి 44,077 ఎకరాల్లో దెబ్బతినగా, పత్తి 9,782 ఎలకరాల్లో, మొక్కజొన్న 13,097 ఎకరాల్లో, సోయాబీన్ 9,102 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.

మెదక్ జిల్లాలో 24,808 మంది రైతులకు చెందిన 23 వేల 169 ఎకరాలలో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో 21 వేల 276 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 18 వేల 417 ఎ కరాలు, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 వే ల 317 ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.అలాగే ఖమ్మం, నిర్మల్, ములుగు, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, జనగామ, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, గద్వాల జోగులాంబ, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పంట నష్టం తీవ్రంగానేఉన్నట్టు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.

ఎక్కువగా దెబ్బతిన్న పత్తి, వరి
భారీ వర్షాలు, వరదల కారణంగా మొత్తంగా 28 జిల్లాల్లో లక్షా తొమ్మిది వేల 626 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి , 16,036 ఎకరాలలో మొక్కజొన్న, 20,983 ఎకరాల్లో సోయాబీన్, 6751 ఎకరాలలో పప్పుధాన్యాలు, 194 ఎకరాలలో మిర్చి, 15 ఎకరాల్లో జొన్న, 116 ఎకరాల్లో వేరుశెనగ, 639 ఎకరాల్లో పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News