- Advertisement -
హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని చత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురువనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, అల్లూరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురువనున్నాయి. కాకినాడ, పోలవరం, ఏలూరులో భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -