- Advertisement -
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం నగరంలో కురిసి భారీ వర్షానికి ఓ వ్యక్తి వరద నీటిలో మునిగి మృతి చెందాడు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. అలాగే, డ్రైనేజిలు పొంగిపొర్లడంతోె రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నగరంలోని సూరారం కాలనీలో భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహంలో మునిగిపోయిన పద్మారావు(40) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం ప్రకారం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో పద్మారావు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -