మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ః రానున్న రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ్‌రెడ్డి ఆదేశించారు. ఈమేరకు మంగళవారం కొంగరకలాన్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వివిధ శాఖలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణ్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్శాల నేపథ్యంలో తీసుకోవల్సిన ముందస్తు చర్యలతోపాటు వనమహోత్సవం, ఇందిరమ్మగృహాల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రెడ్ అలెర్ట్ ప్రకటించినందున యాక్షన్‌టీములను సిద్దం చేయాలని ఆయన ఆదేశించారు. ఫీల్డ్ ఆఫీసర్లు, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆయన సూచించారు.
కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసి 24/7 అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో ప్రమాదకర నాళాలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జిల్లా ఎలాంటి ఆస్థి,ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లతోపాటు శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి ఖాళీచేయించాలని ఆయన సూచించారు. పురాతన భవనాల్లోని సాధారణ పౌరులను సైతం సురక్షిత భవనాలకు తరలించాలని ఆయన సూచించారు. 15సెంటిమీటర్ల వర్శపాతం నమోదైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. భారీవర్శాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. ఫంక్షన్‌హాల్స్ సిద్దం చేయాలని ఆయన సూచించారు.
వనమహోత్సవం లక్షాలను వందశాతం పూర్తిచేయాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆయన సూచించారు. డివియేషన్ వల్ల నిలిచిపోయిన ఇండ్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని కార్యాలయాలపై సొలార్ సిస్టమ్ ఏర్పాటుకు సంబందించిన ప్రతిపాదనలు ఈనెల 16లోగా సమర్పించాలని ఆయన సూచించారు. వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో 7993103347, 040 23237416 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో డిఆర్‌ఓ సంగీత, డిఆర్‌డిఏ పిడి శ్రీలత, డిపిఓ సురేశ్‌మోహన్, వ్యవసాయ అధికారి ఉష, హౌసింగ్ పిడి నాయక్, డీఈఓ సుశీందర్‌రావు, ఎస్సీ సంక్షేమ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు.