- Advertisement -
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య బంగాళాఖాతంపై ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉండడంతో రెండు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో గాలులు వీయనున్నాయి. తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -