నీట మునిగిన వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాలు
మన తెలంగాణ /వరంగల్ బ్యూరో : వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాలు వరదలతో నీట మునిగి పోయాయి. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వరంగల్ మహానగరంతోపాటు రూరల్ జిల్లాల్లో వరదలు ఏరులై పారాయి వరంగల్ నగరంలోనీ హనుమకొండ వరంగల్ జిల్లా కేంద్రాల్లోని చౌరస్తాలు లోతట్టు ప్రాంతాలు అంబేద్కర్ భవన్ ప్రాంతంతో పాటు వరంగల్ లోని అండర్ బ్రిడ్జి ప్రాంతం భారీ వరదలతో నీట మునిగిపోయాయి అండర్ బ్రిడ్జికి భారీగా వరద నీరు చేరడంతో ఐదు ఫీట్ల వరకు నీరు చేరి చేరింది. అందులో నుండి ఆర్టీసీ బస్సులు ఆటోలు వెళ్లడానికి ప్రయత్నం చేయగా బస్సు మధ్యలోనే ఆగిపోయింది దాంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బయటికి వెళ్లలేని పరిస్థితులు ఉండగా ఇంతే జార్ గంజి పోలీసులకు సమాచారం అందిటంతో వారు హుటాహుటినా ఆ ప్రాంతానికి చేరుకొని ప్రయాణికులను ఛాతి వరకు నిండుకొని ఉన్న నీళ్ల నుండి తాళ్ల సహాయంతో బయటకు పంపించారు.
వరంగల్ చౌరస్తాతో పాటు, హంటర్ రోడ్డు, హనుమకొండ చౌరస్తా, కాకాజీ కాలనీ రోడ్లన్నీ వర్ధనీటితో మునిగిపోయాయి. హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటిలోని భారీ అంతస్తులోని సెల్లార్ల లోకి భారీగా నీరు చేయడం వల్ల సెల్లార్లో ఉన్న వాహనాలన్నీ నీట మునిగిపోయాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఎలాంటి ప్రాణం నష్టం జరిగనప్పటికీ ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగినట్లు వ్యాపార వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా ఉండగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట ములుగు మహబూబాద్ జనగామ పరకాల ప్రాంతాల్లో ఉదయం మోస్తరు వర్షం కురిసింది.