Thursday, August 28, 2025

ఉత్తర తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు ఉత్తర తెలంగాణను ముంచెత్తు తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వీటిలో నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి,. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారా బాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.ఈ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

వాతావరణ కేంద్రం అంచనాలకు అనుగుణం గా తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 27 ఉదయం 8:30 గంటల నుంచి 28వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు రికార్డయిన అత్యధిక వర్షపాతం వివరాలను వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసింది. కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాజంపేట మండలం అర్గొండలో 43 సెంటిమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని అక్కాపూర్‌లో 32 సెం.మీ, మెదక్ జిల్లా హవేలిఘనపూర్‌లోని సర్దానాలో 30 సెంమీ, కామారెడ్డి టౌన్ ఐడీఓసీ వద్ద 28 సెం.మీ, నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని వడ్డ్యాల్‌లో 27 సెం.మీ, కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో 27 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా హవేలిఘనపూర్‌లోని నాగపూర్‌లో 27 సెం.మీ, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27 సెం.మీ, కామారెడ్డి పాత రాజంపేటలో 24 సెం.మీ, నిర్మల్ జిల్లా విశ్వనాథపేటలో 24 సెం.మీ, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని ముజిగిలో 23 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 22 సెం.మీ మేర వర్షం కురిసింది.

కామారెడ్డి జిల్లా లింగం పేటలో 22 సెం.మీ, మెదక్ జిల్లా రామాయంపేటలో 20 సెం.మీ, మెదక్ ఆర్‌డీఓ కార్యాలయం వద్ద 20 సెం.మీ, కామారెడ్డి జిల్లా దోమకొండలో 20 సెం.మీ, మెదక్ జిల్లా రాజ్‌పల్లిలో 19 సెం.మీ కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలోని లాచాపెట్‌లో 19 సెం.మీ, కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో 18 సెం.మీ కురిసింది. సిద్దిపేట జిల్లా కొండపాకలో 18 సెం.మీ, కామారెడ్డి జిల్లా పల్వంచలోని ఏలుపుగొండలో 18 సెం.మీ, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని కొడకండ్లలో 17 సెం.మీ, కుమరం భీమ్ జిల్లా రెబ్బెనలో 17 సెం.మీ, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 17 సెం.మీ, నిర్మల్ జిల్లా సారం గాపూర్‌లోని జామిలో 17 సెం.మీ వర్షం పడింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 17 సెం.మీ, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 17 సెం.మీ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోని హసన్‌పల్లిలో 17 సెం.మీ, నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పక్‌పట్లలో 17 సెం.మీ, నిర్మల్ జిల్లా లక్ష్మణచాం దలో 170.0 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News