Thursday, August 28, 2025

క్లౌడ్ బరస్ట్ ?… మెదక్, కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ జరిగినట్టుగా కుంభవృష్టి వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీళ్లలో మునిగిపోయాయి. భారీ వర్షం బీభత్సం సృష్టించడంతో కామరెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లడంతో పలు గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయి. పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం జలాశయం ప్రమాదపు అంచుకు చేరుకుంది. గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో జలాశయం పైనుంచి 8 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవహించింది.

ప్రాజెక్టు అలుగు వద్ద కోతకు గురైంది. పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంజీరా నదిలోకి 1. లక్షల క్యూసెక్కల నీటిని వదిలారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్పితే ఇండ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో 43.1 సెంటీ మీటర్ల అత్యధికంగా నమోదైంది. అక్కాపూర్(28.9 సెంటీమీటర్లు), భిక్‌నూరు(27.9 సెంటీమీటర్లు), వడ్యాల్(29.9 సెంమీ), తాడ్వాయి(27.5 సెంమీ), నాగాపూర్(26.6 సెంమీ), రాజంపేట(24.6 సెంమీ) వర్షపాతం నమోదైంది.

Heavy Rains Kamareddy

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News