Wednesday, September 17, 2025

బెంగళూరులో మూడు రోజులుగా భారీ వానలు

- Advertisement -
- Advertisement -

 

Bangalore rain

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో గత మూడు రోజులుగా భారీ వానలు కురుస్తున్నాయి. బుధవారం 8.5 మిమీ. , గురువారం 12 మిమీ. వానలు కురిసాయి. నేడు శుక్రవారం కూడా ఓ మోస్తరు వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు మూడు రోజులపాటు ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటిగ్రేడ్(గరిష్ఠం), 21 డిగ్రీల సెంటిగ్రేడ్ (కనిష్ఠం) ఉండగలదని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వానలకు బెంగళూరులోని బన్నేరఘట్ట రోడ్డు, ఛామరాజ్‌పేట్, కత్రిగుప్పే, బాస్కెట్‌బాల్ గ్రౌండ్, యశ్వంతపురలో చెట్లు నేలకూలాయి. లోతట్టు ప్రాంతమైన కామాఖ్య థియేటర్ ప్రాంతంలో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. యెలచెనహల్లిలో దాదాపు 50 ఇళ్లలోకి వాన నీళ్లు ముంచెత్తాయి. డ్రెయినేజ్‌లు ఓవర్‌ఫ్లో అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News