- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ముగ్గురు మరణించారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నష్రీ, బనిహాల్ మధ్య పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. వరదలు ముంచెత్తడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.
వరదల కారణంగా చనిపోయిన వారిని రాంబన్‌లోని సెరి బాగ్నా గ్రామానికి చెందిన సోదరులు అకిబ్ అహ్మద్, మొహమ్మద్ సాకిబ్ లు గుర్తించారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో స్థానిక పోలీసులతోపాటు SDRF బృందం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -