రిషికేశ్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శనివారం ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఎయిమ్స్ రిషికేశ్ హెలి అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన హెలికాప్టర్ వెనుక భాగంలో దెబ్బతినడంతో కూలిపోయింది. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎత్తైన ప్రాంతంలో వైద్య అత్యవసర సేవలో పాల్గొనేందుకు వెళ్లిన హెలికాప్టర్ వెనుక భాగంలో సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర ల్యాండింగ్ జరిగింది. ఈ క్రమంలో హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో పైలట్, ఓ డాక్టర్, వైద్య సిబ్బంది ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ప్రాణనష్టాన్ని నివారించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్, ఆన్‌బోర్డ్ సిబ్బంది కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు.
కేదార్‌నాథ్‌లో హెలి అంబులెన్స్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
- Advertisement -
- Advertisement -
- Advertisement -