కెజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు హీరో యశ్ (Hero Yash). అంతకు ముందు ఆయన పలు సినిమాల్లో నటించిన కేవలం కర్ణాటక వరకే అయన పేరు తెలిసేది. కానీ కెజిఎప్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆయన చేసిన యాక్షన్, ఫైట్స్, డైలాగ్స్ అన్ని హైలైట్‌గా నిలిచాయి. అయితే యశ్ తల్లి (Mother) పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ‘కోథలవాడి’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో యశ్ గురించి పుష్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 రెండు సినిమాల్లో యశ్ (Hero Yash) రఫ్ లుక్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ లుక్‌కి ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. దాంతో యశ్ అదే లుక్‌ని కొనసాగిస్తున్నారు. అయితే తన కుమారుడిని స్టైలిష్ లుక్‌లో చూడాలని కోరుకుంటున్నారని పుష్ప (Mother) అన్నారు. ఆ విషయమే యశ్‌ని అడిగితే.. ‘అలా ఉంటే ఎవరు చూస్తారమ్మా? నీ కోసం సినిమా చేయాలా?’ అని అంటాడని ఆమె వెల్లడించారు. యశ్‌తో ఎప్పుడు మాస్ లుక్‌లో ఉండవద్దని చెబుతుంటానని ఆమె అన్నారు. కెజిఎఫ్ తర్వాత యశ్ తను ఎంపిక చేసే సినిమాల విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ జానర్‌లో ఈ సినిమాను గీతు మోహన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.