Tuesday, September 9, 2025

మంగళవారం రాశి ఫలాలు (09-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం –  మిమ్మల్ని మీరు ఒంటరి వారిగా భావిస్తారు. ఏమి జరిగినా మన మంచికే జరిగిందని వేదాంత తత్వాన్ని కనబరుస్తారు. ముఖ్యమైన పత్రాలు లేక విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్త వహించండి.

వృషభం –  భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు.

మిథునం – బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఓ కొలిక్కి వచ్చే సూచనలున్నాయి.

కర్కాటకం – చిన్న చిన్న విషయాలకు కూడా భావోద్వేగాన్ని కలిగి ఉంటారు. ఉచిత సలహాలను ఇవ్వడం తీసుకోవడం రెండు కలిసిరావు. వ్యాపార పరంగా లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి.

సింహం – విందు వినోదాలు ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మెలకువతో వ్యవహరించడం చెప్పదగినది. స్వల్పకాలిక వ్యాపారాలను ప్రారంభిస్తారు, వైరివర్గంతో అప్రమత్తంగా మెలగడం మంచిది.

కన్య –  రుణాల మీద వడ్డీలు తగ్గించుకోవడానికి గాను చేసే యత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూలపడుతుంది. పరపతిని పెంపొందించుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి.

తుల – మొండికి పడిన పనులలో కదలిక ఏర్పడుతుంది. ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్య చర్చలు, శుభకార్య ప్రసంగాలు సాగిస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు.

వృశ్చికం – ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగినది.  ఆదాయాన్ని మించిన ఖర్చులు గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు.

ధనుస్సు – కొనుగోలు అమ్మకాలను సాగిస్తారు. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. ఉద్యోగుల బదిలీ లేక ప్రమోషన్ విషయంలో సాంకేతికపరమైన లోపాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి.

మకరం – వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన యోగక్షేమాల పట్ల అధిక శ్రద్ధను కనబరుస్తారు

కుంభం – అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి జాగ్రత్త వహించాలి. పనులలో మీరు ఊహించని ఆటంకాలను ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదు.

మీనం – వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది. అన్నింట అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక స్థితి పైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. స్పెక్యులేషన్ కు దూరంగా ఉంటారు.

Rasi phalalu cheppandi

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News