హీరో సుహాస్ (Suhas) ప్రస్తుతం నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ పూర్తి ఎంటర్‌టైనర్‌ను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్ ఫేం షణ్ముక ప్రశాంత్ ఈ కథను రాశారు. సుహాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను లాంచ్ చేసి ఫన్‌ని డబుల్ చేశారు. ఈ చిత్రానికి హే భగవాన్! అనే టై టిల్ పెట్టారు. ఈ టీజర్ సస్పెన్స్, కామెడీతో అదిరిపోయింది. ఈ ఈవెంట్‌లో హీరో సుహాస్ మాట్లాడుతూ “ప్రశాంత్ ఈ సినిమాకి అద్భుతమైన కథ ఇచ్చాడు.
డైరెక్టర్ గోపి కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ కి కూడా పనిచేశారు. ఈ సినిమా తో కచ్చితంగా మంచి హిట్ కొడతాం”అని అన్నారు. డాక్టర్ నరేష్ వి కె మాట్లాడుతూ “హే భగవాన్ టైటిల్ (Hey Bhagavan title) ఎందుకు పెట్టామో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. కథ విన్నప్పుడు పగలబడి నవ్వాను. చాలా కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. హే భగవాన్ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్”అని తెలిపారు. డైరెక్టర్ గోపి అచ్చర మాట్లాడుతూ ఈ సినిమాలో తం డ్రి, కొడుకుల మధ్య మంచి భావోద్వేగ కథ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయి న్ శివాని, వంశీ నందిపాటి పాల్గొన్నారు.