Saturday, September 13, 2025

యాదగిరిగుట్టలో భక్తులకు హైటెక్-డిజిటల్ సేవలు

- Advertisement -
- Advertisement -

యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సందర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో శనివారం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆరు కొత్త కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు పది లక్షలు విలువతో యంత్రాలను భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ తమ సేవా కార్యక్రమంలో భాగంగా విరాళంగా అందించింది. ఈ కియోస్క్ యంత్రాలను భక్తులకు మరింత అనుకూలంగా ఉండే విధంగా ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో యూనిట్ ఒక్కో విభాగంలో సహకారం అందించనున్నాయి. మూడు యూనిట్లు – ప్రసాదం విభాగంలో, ఒక యూనిట్ – చౌల్ట్రీస్‌లో, ఒక యూనిట్ – డోనార్ సెల్ వద్ద, ఒక యూనిట్ – వ్రత మండపంలో ఏర్పాటు చేశారు. ఈ స్వీయ సేవా కియోస్క్ యంత్రాల యందు భక్తులు తమ అవసరమగు టికెట్లను క్యాష్లెస్ అనగా డిజిటల్ పేమెంట్ ద్వారా పొందవచ్చ. ఈ స్వీయ సేవా కియోస్క్ యంత్రాల ద్వారా భక్తులు సులభంగా దర్శన టిక్కెట్లు, సేవలు, ప్రసాదాలు, వ్రతాలు, ఇతర అనేక సేవలను పొందవచ్చు.

దీని ద్వారా భక్తులు పెద్ద క్యూలలో నిలబడకుండా, సమయాలపై స్పష్టమైన సమాచారంతో, కౌంటర్ల వద్ద ఆలస్యం లేకుండా వెంటనే బుకింగ్ చేసుకోనుటకు, వేగవంతంగా, సులభంగా, పారదర్శకంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటరావు మాట్లాడుతూ కియోస్క్ యంత్రాల ప్రవేశపెట్టడం ద్వారా ఆలయ సేవల్లో ఆధునికీకరణ దిశగా ఒక కీలకమైన ముందడుగు వేసిందని అన్నారు. ఇవి భక్తుల అమూల్యమైన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడంలో సహకరిస్తాయనీ, దీంతో భక్తులకు మరింత ఆనందదాయకం, పారదర్శకతతో కూడిన, ఇబ్బందులేని ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా భక్తుల సౌకర్యాల అభివృద్ధి కోసం చేసిన ఈ గొప్ప సహకారానికి కెనరా బ్యాంక్‌కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్స్ పల్ సెక్రటరీ, కమిషనర్ (అదనపు బాధ్యతలు) శైలజా రామయ్యర్, ఆలయ ఈవో వెంకటరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: జన జీవన స్రవంతిలోకి కేంద్ర కమిటీ సభ్యురాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News