- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : బోధన్ మాజీ ఎంఎల్‌ఎ షకీల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివే యాలని షకీల్ వేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. షకీల్‌పై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన తరపున న్యాయ వాది తెలిపారు. అయితే ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత షకీల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రజాభవన్ ఎదురుగా ఉన్న బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కుమారుడు సాహిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని షకీల్‌పై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో షకీల్‌పైనా పోలీసులు కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
- Advertisement -