Tuesday, August 26, 2025

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అడ్డంకి తొలగిపోయింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించేందుకు హైకోర్టు అనుమతించింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 2020 అక్టోబర్ 10న రాష్ట్ర ప్రభుత్వం జివో విడుదల చేసింది. ఈ జివొపై 2020 నవంబర్‌లో ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. చట్టంలో అవకాశం లేకుండా ఎలా క్రమబద్ధీ కరిస్తారని ప్రశ్నించింది. కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ అంశం పొందుపర్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన ధర్మాసనం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అంగీకరిస్తూ కేసు విచారణను ముగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News