- Advertisement -
ఓ స్థల వివాదంలో జిహెచ్‌ఎంసి, హైడ్రాకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో సుమారు రూ. 100 కోట్ల విలువ చేసే రెండు వేల గజాల స్థలాన్ని ఇటీవల కాలంలో హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో సదరు స్థలం తనదేనంటూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. జిహెచ్‌ఎంసి, హైడ్రా తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆ స్థలం జిహెచ్‌ంఎసి, హైడ్రాకు చెందినదని కోర్టుకు తెలిపారు. వాదన విన్న ధర్మాసనం హైడ్రాకు, జిహెచ్‌ఎంసికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: పట్టపగలే భారీ దారి దోపిడీ
- Advertisement -