Friday, May 2, 2025

టిజిపిఎస్‌సిపై హైకోర్టు ప్రశ్నల వర్షం

- Advertisement -
- Advertisement -

గ్రూప్1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తీరుపై
వివరణ కోరిన న్యాయస్థానం విచారణ నేటికి వాయిదా
ఆలస్యం జరగకుండా త్వరితగతిన ముగించాల్సిన
అవసరం ఉందన్న ఉన్నత న్యాయస్థానం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహ ణ, మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం బుధవారం విచార ణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యా యస్థానం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్‌సి) అనుసరించిన విధానాలపై పలు కీలక ప్రశ్నలు సం ధించింది. విచారణ సందర్భంగా పి టిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, వరుస క్రమం లో హాల్ టికెట్ నంబర్లు కలిగిన కొం దరు అభ్యర్థులకు ఒకే విధమైన మా ర్కులు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, నిబంధనల ప్రకారం ప్రొవిజనల్ మార్కుల జాబితాను నిర్ణీత సమయంలో వెల్లడించలేదని, సుమారు 20 రోజుల త ర్వాత తుది మార్కులను ప్రకటించార ని తెలిపారు. ఈ మధ్యకాలంలో అవకతవకలు జరిగి ఉండవచ్చనే అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, టిజిపిఎస్‌సి అనుసరించిన మూల్యాంకన ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. ముఖ్యంగా, తెలుగు మా ధ్యమంలో పరీక్ష రాసిన అభ్యర్థుల జవాబు ప త్రాలను ఎలా మూల్యాంకనం చేశారని ప్రశ్నించింది.

‘తెలు గులో పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వేశారనే ఆందోళన వ్యక్తమవుతోంది. మూల్యాంకనం కోసం జవాబులకు సంబంధించి ఏదైనా ’కీ’ పేపర్ ఉంటుందా? తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలకు వేర్వేరుగా ’కీ’ ఇచ్చారా?‘ అంటూ టీజీపీఎస్సీని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి టిజిపిఎస్‌సి ప్రతినిధులు స్పందిస్తూ, ఇది రాతపూర్వక పరీక్ష అయినందున మూల్యాంకనం చేసే నిపుణులకు ఎలాంటి ’కీ’ పేపర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. జవాబు పత్రాలను దిద్దిన వారంతా సంబంధిత సబ్జెక్టుల లో నిపుణులని, వారి నైపుణ్యం ఆధారంగానే మూల్యాంకనం జరిగిందని కోర్టుకు వివరించా రు. అనంతరం, ఈ గ్రూప్-1 పరీక్షలో తెలుగు మాధ్యమంలో ఎంతమంది పరీక్ష రాశారు, వా రిలో ఎంతమంది తుది ఎంపిక జాబితాలో ఉ న్నారనే వివరాలను సమర్పించాలని టిజిపిఎస్ సి హైకోర్టు ఆదేశించింది. గతంలో జరిగిన గ్రూ ప్-1 పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తామని కమిషన్ కోర్టుకు తెలియజేసింది. రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ నేపథ్యంలో కేసు విచారణను అనవసరంగా ఆలస్యం చేయకుండా త్వరితగతిన ముగించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News