Friday, September 5, 2025

గణేష్ నిమజ్జనానికి 30వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః నిమజ్జనానికి భారీ బందోబస్తు హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జోన్ల వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సమావేశాల్లో అధికారులకు వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాలు చేసిన విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేలా ఆయా మండపాల నిర్వాహకులతో సమావేశమై మార్గనిర్ధేశం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ పోలీస్ విభాగాల నుండి దాదాపు 19,000 మంది, జిల్లాల నుండి 8,500 మంది పోలీసులు, 42 ప్లాటూన్లు, 10 సీఏపీఎఫ్ కంపెనీలు, ఆక్టోపస్ బృందాలను నిమజ్జనం బందోబస్తుకు వినియోగించనున్నారు. మొత్తం 30,000మంది పోలీసులను వినాయకుడి నిజ్జనానికి వినియోగిస్తున్నారు. వీటికి తోడు నిమజ్జన ఊరేగింపులను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత స్టిక్కర్లతో పర్యవేక్షించనున్నారు. నగరంలోని 10,900 గణేష్ మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు ఇచ్చారు, వీటిని నిర్వాహకులు త్వరగా నిమజ్జనం చేసేలా సమయం ఇచ్చారు, వాటికి జియో ట్యాగింగ్ చేయడంతో నిమజ్జనం త్వరగా పూర్తిచేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అలాగే ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద ఉమ్మడి నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌లోని టీజీ ఐసీసీసీ వద్ద 24 గంటలూ పనిచేసే విధంగా ఉమ్మడి నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్, మీరాలం ట్యాంక్, రాజన్న భావి, ఎన్టీఆర్ స్టేడియం వంటి ప్రాంతాలలో 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సెప్టెంబర్6వ తేదీ మధ్యాహ్నం వరకే నిమజ్జనం చేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బడా గణేష్ విగ్రహాన్ని ముందుగా నిమజ్జనం చేస్తే మిగతా వాటిని త్వరగా చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్‌బండ్‌పై 40 క్రేన్ల ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి ప్రారంభం కానున్న ఊరేగింపులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇది వరకే పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు, ఊరేగింపుకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ అధికారులను ఆదేశించారు.

ముమ్మరంగా పెట్రోలింగ్…
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బ్లూకోట్ సిబ్బందిని నగరంలోని పలు ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఏదైన సంఘటన జరిగితే వెంటనే అక్కడికి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే పెట్రోలింగ్ వాహనాలకు కెమెరాలను అమర్చి నగరంలో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. దాని ద్వారా ఎప్పటి కప్పుడు కమాండ్ కంట్రోల నుంచి ఆదేశాలు జారీ చేయనున్నారు, కొందరు పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కూడా వినాయకుండి నిమజ్జనాన్ని పరిశీలించనున్నారు. ఎక్కడైనా ట్రాఫిక్ జాం ఏర్పడినా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాన్ని పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా డ్రోన్లను ఉపయోగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News