గుండ్ల పోచంపల్లి మైసమ్మ గూడలో ని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ముందు శనివారం ఎ న్‌ఎస్‌యుఐ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు హాజరు శాతం లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, క ళాశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థుల వద్ద అధిక వసూలు చేయడమే కాక,పలు కారణాలు చెప్పి డబ్బులు దండుకుంటున్న యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌యు నాయకులు కళాశాల అద్దాలు పూల కుండీలు ధ్వంసం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నర్సింహరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్‌ఎస్‌యుఐ నేతల వివరణ కండోనేషన్ ఫీజు కింద విద్యార్థుల నుండి నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం భారీ ఎత్తున డబ్బులు వ సూలు చేస్తున్నారని నాయకులు తెలిపారు. తాము సైతం దా డులు దిగడానికి రాలేదని శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు వచ్చామని, అయితే కళాశాల సిబ్బంది తో పాటు ఇతర సిబ్బంది రెచ్చగొట్టడం వల్లే దాడికి దిగాల్సి వచ్చిందని, ఎన్‌ఎస్‌యుఐ నేతలు పేర్కొంటున్నారు. అయితే కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పేట్ బషీర్బాగ్ పోలీసులు ఎన్‌ఎస్‌యుఐ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.