Tuesday, August 26, 2025

కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. మంగళవారం కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయానికి (Vaishno Devi Temple) వెళ్లే మార్గంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. ఘటనస్థలిలో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News